Breaking News

ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ కు షేక్ అల్మక్టూమ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్యాలయం నుండి ప్రశంసలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎక్సెల్లా ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ యూఏఈ దుబాయ్‌లో ఎక్సెల్లా ఎనిమిదో బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు గ్రూప్‌ చైర్మన్‌ అరసవిల్లి అరవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిత కోసం భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు సైతం వెనుకాడని, ఎక్సెల్లా ఎడ్యుకేషన్‌ యూఏఈ దుబాయ్‌లో ఎక్సెల్లా ఎనిమిదో బ్రాంచ్‌ను ప్రారంభించిందన్నారు. గ్రూప్‌ చైర్మన్‌ అరసవిల్లి అరవింద్‌ చొరవను అక్కడి దుబాయ్‌ రారాజు షేక్‌ అల్మక్టూమ్‌ ఫ్యామిలీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కార్యాలయం ప్రశంసించింది. అరవింద్‌ వేసిన ముందడుగు స్ఫూర్తిదాయకంటూ అల్మక్రూమ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫీస్‌ కొనియాడిరది. ఈ నేపథ్యంలో అల్మక్రూమ్‌ బృందం ఎక్సెల్ల్లా ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ చైర్మన్‌ అరసవిల్లి అరవింద్‌ను తమ కార్యాలయంలో అభినందించి ప్రశంసాపత్రాన్ని అందించింది. దుబాయ్‌ నలుచెరగులా ఎక్సెల్లా ఎడ్యుకేషన్‌ గ్రూప్‌ సేవలు విరజిమ్మాలని అల్మక్రూమ్‌ ఫ్యామిలీ ఆకాంక్షించిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *