Breaking News

రాణీ వారి పంచాంగ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శ్రీశోభకృన్నామ సంవత్సర రాణీ వారి పంచాంగ ఆవిష్కరణ జరిగింది. పంచాగ కర్తలు అయిన బ్రహ్మశ్రీ డా॥ రాణీ నరసింహమూర్తి, దైవజ్ఞ డా॥ రాణీ లక్ష్మీనారాయణ శర్మలు శనివారం సత్యనారాయణపురంలోని శ్రీ సీతారామ కళ్యాణమండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా మాజీ ఎంపి గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎపి ఫైబర్‌ కార్పొరేషన ఛైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి, జాయింట్‌ కమీషనర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ కోటేశ్వరమ్మ హాజరై రాణీ వారి పంచాంగ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి, సంపాద్రాయాలలో పంచాగానికి ప్రథమ స్థానం వుందని మంచి చెడులకు, రాశిఫలాలకు, శుభ దినాలు తదితర వివరాలను తెలుసుకోవాలంటే ముందుగా చూసేది ఈ పంచాగమేనని అన్నారు. ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రతి తెలుగువారు పూజా కార్యక్రమాలతోపాటు పంచాగ శ్రవణం చేస్తారు. అది శుభసూచకంగా ఆనవాయితీగా వస్తుంది. అటువంటి ప్రాధాన్యం కలది ఈ పంచాంగం. అటువంటి ఈ పంచాగాన్ని అన్ని వివరాలతో నిష్ణాతులు, పండితులు అయినవంటి పంచాగకర్తలు తయారు చేసి మాచేత విడుదల చేయించడం ఎంతో ఆనందంగా వుందన్నారు. అనంతరం పంచాగకర్తలు రాశిఫలాలు, గ్రహాఫలాలు, ఈ సంవత్సరంలో జరుగు పరిస్థితులు, మార్పులు, దోషాలు, వాటి పరిహారం, నివారణ, అభివృద్ధి, మంచిచెడులు తదితర విషయాలను చదివి వినిపించారు. దమ్మాలపాటి చంద్రశేఖర్‌ సభాధ్యక్షులు వ్యవహరించారు. అనంతరం ముఖ్యఅతిధులను సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పంచాంగం శ్రవణం కోసం స్థానికులు, తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *