Breaking News

మహిళా సాధికారతలో దేశంలోనే అగ్రగామి

-వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఆదివారం జరిగిన వైఎస్సార్ ఆసరా మూడో విడత సంబరాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆడపడుచులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. గత చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా.. పొదుపు సంఘాల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేశారు. కానీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వైఎస్సార్ ఆసరా పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. వడ్డీతో కలిపి మొత్తం సుమారు రూ. 26 వేల కోట్లు చెల్లించేలా పథకానికి కేటాయింపులు జరిపారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నాలుగో విడత ఆసరా విడుదలకూ ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు ప్రతిపాదించారని వివరించారు. 57 డివిజన్ కు సంబంధించి మూడవ విడత ఆసరా ద్వారా 123 గ్రూపులలోని 1,209 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. 97 లక్షల 5 వేల 902 రూపాయల నిధులు జమ చేసినట్లు తెలిపారు. అత్యధికంగా పరమేశ్వరి పొదుపు సంఘానికి రూ. 2 లక్షల 41 వేలు అందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని రోజువారీ అవసరాలకు వినియోగించకుండా.. పెట్టుబడి సాయంగా వ్యాపారాలను ప్రారంభించాలని సూచించారు. తద్వారా తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలిపారు.

టీడీపీకి మరోసారి గట్టి గుణపాఠం తప్పదు
గత తెలుగుదేశం ప్రభుత్వంలో డివిజన్ పూర్తి నిర్లక్ష్యానికి గురైందని మల్లాది విష్ణు అన్నారు. ప్రాంత అభివృద్ధికి గత పాలకులు కనీసం తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి వీధిలో రోడ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. న్యూ ఆర్.ఆర్.పేటలో 2,053 మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతవాసుల ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్.ఆర్.పేటలో 2,813 మందికి నామమాత్రపు రుసుము గజానికి కేవలం రూ. 100 కే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఇందుకోసం ఇప్పటికే వీఎంసీలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనిచేస్తోందని.. ఆ కార్యాలయాన్ని స్థానికంగా మార్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 65 ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తే.. జగనన్న ప్రభుత్వం మాత్రం పేదల పక్షాన నిలబడిందని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం గత ఐదేళ్ల అరాచక పాలనను నేటికీ ప్రజలు మర్చిపోలేదన్నారు. 2019 తర్వాత జరిగిన పలు ఎన్నికలో అభ్యర్థులు లేక భయపడి పారిపోయిన తెలుగుదేశం.. ఇవాళ బీరాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. కనుక ఎన్నికలకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నా.. టీడీపీకి ఓటు వేయడానికి ప్రజలు మాత్రం సిద్ధంగా లేరన్నారు. తెలుగుదేశానికి మరోసారి తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, సీడీఓ జగదీశ్వరి, నాయకులు ఇసరపు రాజా రమేష్, భోగాది మురళి, చెన్నకేశవరెడ్డి, చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రేమ్, కాళ్ల శ్రీను, బాల, భాగ్యలక్ష్మి, చిట్టెమ్మ, రజియా, దుర్గాప్రసాద్, కనకారావు, దుర్గారావు, పొదుపు సంఘాల మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *