Breaking News

ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి.పబ్లిక్ పరీక్షలు

-పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 28412 అభ్యర్థులు,152 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
-పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్ష ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల విభజన అనంతరం మొదటి సారి తిరుపతి జిల్లాలో 152 పరీక్షా కేంద్రాల్లో 28412 అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో పోలీస్ బందోబస్తు , పరీక్ష పత్రాల ఎస్కార్ట్ బద్రతతో తరలింపు చేయనున్నామని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ పదవ తరగతి హాల్ టికెట్ కలిగిన విద్యార్థుల కు ఉచితంగా పరీక్ష కేంద్రాలకు ప్రయాణం చేయవచ్చని, ఆలస్యం లేకుండా విద్యార్థులు పరీక్షా కేంద్రాల కు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి వుండదని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9:30 గం. నుండి ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 12.45 గం.ల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గం. నుండి సాయంత్రం 5.30 గం. వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *