-మేము మీకోసం ఇక్కడ ఉన్నాం.. పౌర సేవలు అందించే క్రమంలో భరోసా కల్పించాలి

-కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం
– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
-ప్రతిజ్ఞ చేయించిన జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సేవకులం అనే భావన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో “16 వ జాతీయ పౌర సేవలు దినోత్సవానికి” ముఖ్య అతిథులుగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషి చెయ్యడం ద్వారా వత్తిడిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు, పథకాలు అమలు చేయడం లో జిల్లాను అగ్రస్థానం లో నిలపడం సాధ్యం అయిందని పేర్కొన్నారు.. ప్రజలకు సేవకులం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని, పదవి తో పాటు గా బాధ్యత కూడా కలిగి ఉంటుందని అన్నారు. ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ విధుల్లో భాగంగా ఎంతో సమన్వయం సాధించడం ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించడానికి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించగలం అనే నమ్మకాన్ని సాకారం చెయ్యడం కోసం ఎన్నో వత్తిడిలు, ప్రలోభాలకు అందిగ మించాల్సి ఉంటుందని అన్నారు. వత్తిడిని అధిగమించి  ప్రజలకు పౌర సేవలు అందించడం లో సమన్వయం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని మాధవీలత అన్నారు. మనందరం సమిష్టిగా పనితీరు చూపడం ద్వారా తూర్పు గోదావరి జిల్లా కు మంచిపేరు సాధ్యం అయిందని, ప్రతి ఒక్కరికీ పౌర సేవల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిన ఒక ఘటన కలెక్టర్ ఉదహరిస్తూ, వాలంటీర్ ఉద్యోగి తన భావనలు తనతో పంచుకోవడం జరిగిందని అన్నారు. అర్థరాత్రి ఒక కుటుంబంలో వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భంలో ఆరోగ్యశ్రీ కార్డు లేక వైద్య సేవలు అందించే సామర్థ్యం లేక వాలంటీర్ ను సంప్రదించడం జరిగిందని అన్నారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడి ఆరోగ్యశ్రీ సేవలు అందించే విధానం తనకు ఎంతో సంతృప్తి నివ్వడం పై వాలంటీర్ పరిణితి ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు.జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, భారత దేశ పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు వెన్నెముఖ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్కొనడం జరిగిందన్నారు.  దేశ జనాభా 146 కోట్లు ఐతే అందులో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు దేశవ్యాప్తంగా 33 లక్షల మంది ఉన్నారన్నారు. అంటే ప్రతి వంద మందిలో 2.3 శాతం మంది మాత్రమే 97.7 శాతం మంది కి పౌర సేవలు అందించడం జరుగుతోందని అన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణ లో ఐ ఎ ఎస్ అధికారులు మార్గ నిర్దేశకులుగా వ్యవహరిస్తూన్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులు తుఫానులు, వరదలు, ప్రకృతి విపత్తులు, యుద్దాలు, దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ప్రధాన కారణం అన్నారు. మారుతున్న , సమకాలిక  పరిస్థితులు అనుగుణంగా భాద్యతలు చేపట్టాలని కోరారు. కర్ణాటక లో పౌర సేవలు అందించే క్రమంలో  ఆధార్ కార్డు లేని మహిళలకు తక్షణ కర్తవ్యం గా వైద్య సేవలు అందించే క్రమంలో అక్కడి ఉద్యోగి చూపిన విజ్ఞత ఎంతోమంది మన్ననలను పొందిన విషయాన్ని ప్రస్తావించారు.మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, మన స్వాతంత్ర్య భారత దేశాన్ని పాలించుకునే హక్కు సాధించడం కోసం ఎన్నో త్యాగాలను చెయ్యడం ద్వారా, పోరాటాలు చేయడం ద్వారా మాత్రమే సాధ్యం అయిందని పేర్కొన్నారు. ఈరోజు మనం సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు  మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే అన్నారు. వారుచేసిన త్యాగాలు స్మరించుకుంటూ విధులు, భాద్యతలు పట్ల పునరంకితం అవుదామని అన్నారు. మార్గదర్శకాలు కంటే వాటి ఆచరణ పద్ధతులు ముఖ్యం అన్నారు. స్వాతంత్య్రం వొచ్చే నాటికి మన దేశంలో అక్షరాస్యత శాతం 25 శాతం ఉండే దని, మనం చేపట్టిన సంస్కరణలు, విధి విధానాలు అమలు చేయడం వల్ల నేడు 75 శాతం చేరుకోగలిగాం అని పేర్కొన్నారు.ఈ సభా కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు వాఖ్యతగా వ్యవహారించారు. అనంతరం కలెక్టర్, జేసీ, కమిషనర్ సమక్షంలో కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తదుపరి కలెక్టర్ డా మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ లకు రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు ఘనంగా సత్కరించడం జరిగింది.డీఆర్వో జి.నరసింహులు మాట్లాడుతూ
పౌర సేవలు అందించడంలో పరిపాలనా యంత్రాంగాన్ని సమిష్టిగా, ఓకే తాటిపై సమన్వయంతో నడిపిస్తూ అంకితభావంతో ప్రజా పాలన వ్యవస్థకు మూల స్తంభాలు గా భారత పరిపాలన వ్యవస్థ కీలక పాత్ర వహిస్తారన్నారు.కొవ్వూరు ఆర్డీవో ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ సుపరిపాలని లక్ష్యంగా సమాజంలోని చిట్ట చివరి అర్హత కలిగిన వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందజేస్తూ సమాజాభివృద్ధికి ఎనలేని కృషి చేయడం, సంస్కరణలు చేపట్టడం వలన ప్రజల్లో ఆ ఉన్నత అధికారుల తనదైన ముద్రను వేశారన్నారు. ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ అధికారులుగా పలువురు చరిత్రలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి మాట్లాడుతూ
నవభారత నిర్మాణంలో మార్పునకు సారథులు’గా సివిల్ సర్వీసెస్ పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాల సరైన అమలుతోనే సమాజశ్రేయస్సు సాధ్యం మని, సర్దార్ వల్లబాయ్ పటేల్ వివక్షలేని సమాజాభివృద్ధికి కృషిచేయాలనే సంకల్ప దీక్ష ద్వారా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఐ ఎ ఎస్ అని పేర్కొన్నారు. జిల్లాను అగ్రస్థానంలో నిలపడంలో, వత్తిడిని అధిగమించి చాకచక్యంతో వ్యవహరించడంలో కలెక్టర్ మాధవీలత సహనం మాలాంటి అధికారులకు దిక్సూచి అని పేర్కొన్నారు.కార్యక్రమంలో  డీఆర్వో  జి.  నరశింహులు, ఆర్డీ ఓలు ఏ. చైత్రవర్షిణి, ఎస్. మల్లిబాబు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ కె.ప్రకాష్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,   గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్.జ్యోతి ,డిపిఓ పి. జగదాంబ, డి ఎల్ డిఓ  పి. వీణాదేవి, డీఎస్ఓ పి. ప్రసాదరావు, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, డి ఎల్ డివో వి. శాంత మణి, డిఆర్డీఏ పిడి ఎస్. సుభాషిణి, డిపిఆర్వోఐ. కాశయ్య,  డి ఎం (సీఏస్) వి నాగార్జున రెడ్డి, ఎ వో జీ. భీమా, పలువురు జిల్లా శాఖా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *