విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలందరికీ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్ నెల్సన్ మండేలా పార్క్,5వ డివిజన్ 7టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసాం అని వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపామని, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం ‘జగనన్న సురక్ష’ చేపడుతున్నామనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని స్పష్టం చేశారు. నెల రోజల పాటు చేపట్టనున్న ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా జనన, మరణ, వివాహ, కుల, ఆదాయం వంటి వివిధ రకాలైన 11 సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సేవలు ఎక్కడా అందించలేదని, ఒక్క ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుండి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతొందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ‘జగనన్న సురక్ష’ ను సద్వినియోగం చేసుకుని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.