ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం 6వ డివిజన్ కోకా కోలా స్ట్రీట్, రాము  వీధి నందు 40లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు ఈ రోడ్లు దుస్థితి గురుంచి మా దృష్టికి తీసుకురాగా నాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో కొండప్రాంతా అభివృద్ధి గాలికొదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసారని విమర్శించారు. విజయవాడలో కొండప్రాంతం అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తూర్పు కూడా ఒకటి అని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక దృష్టి పెట్టీ నూతన మెట్ల మార్గాలు, సైడ్ డ్రైనేజీ, మంచినీటి కుళాయి లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే కొండప్రాంతా అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని అవినాష్ సవాల్ విసిరారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గాని, నియోజకవర్గ నాయకులు గాని ,డ్రామాలు వేసే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాని చర్చకు వస్తే వైసీపీ డివిజన్ నాయకులే వారికి సమాధానం చెబుతారు అని తెలిపారు. ఈ నాలుగేళ్ళ కాలంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో జరిగింది అని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ అమర్నాధ్,తూర్పు కాపు కార్పొరేషన్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్ వైసిపి నాయకులు ప్రభు,రామకృష్ణ,ముసలయ్య,శ్రీనివాస్,లక్ష్మణరావు,శంకర్,డాలి,భీముడు,నాని తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన చేసిన ప్రతి పనిని పూర్తి చేస్తాం:రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరం అన్నివిధాలా అభివృద్ధి లో అగ్రగామిగా నిలుస్తోంది అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. 6వ డివిజన్ నందు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయనివిధంగా ప్రతి సచివాలయానికి 20లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూ పరిపాలన ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ప్రభుత్వానిదే అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతి నిత్యం ఏదో ఒక శంకుస్థాపన గాని, ప్రారంభోత్సవం గాని జరుగుతుంది అంటే అది అవినాష్ గారి పనితీరు కు నిదర్శనం అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *