అభివృద్ధి జరుగుతున్నటువంటి ఎక్సెల్ ప్లాంట్ మరియు

-కాలువల శుభ్రత, ఫూట్ పాత్ నిర్మాణ పనులు పరిశీలన,
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను శనివారం నగర కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు జరుగుతున్న పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు.ఎంట్రేన్స్ గేటు దగ్గర ఏర్పాటు చేసిన సెక్యూరిటీ రూమ్ ను మరియు నూతనంగా కొన్న వస్తువులను పరిశీలించి ఎక్కడెక్కడ ఏయే వస్తువులను అమర్చలో అధికారులను పలు సూచనలు చేశారు. ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు.ప్లాంట్ ఆవరణలో ఉన్న ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, ఆఫీసు బిల్డింగ్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్, వెహికల్ పార్కింగ్ వంటి ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.తదుపరి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న కాలువల శుభ్రతకు ప్రజలంతా బాధ్యతగా సహకరించేలా పర్యవేక్షించాలని, కాలువలలో బహిరంగ ప్రదేశాలలో మరియు వీధుల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారుకాలువల శుభ్రత పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 34వ వార్డ్ సికే రెడ్డి రోడ్డు, మీసాల రావు బ్రిడ్జి ప్రక్కన పర్యవేక్షించి కాలువ ప్రక్కన ఉన్న చెక్క పెట్టెలను అక్కడి నుంచి తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు.
తదుపరి బందరు రోడ్డులో గల దూరదర్శన్ ఆఫీసు దగ్గర జరుగుతున్న కారిడార్ ఫూట్ పాత్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఫూట్ పాత్ నిర్మాణ రాళ్ళను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. నగరంలో ఉన్న అనీ ప్రధాన జంక్షన్లు అభివృద్ధి పరిచే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని కమిషనర్ అన్నారు.ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, (డిప్యూటీ సిటి ప్లానర్ ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *