Breaking News

గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి .వై.యస్.జగన్మోహన్ రెడ్డి  ప్రవేశ “జగనన్న సురక్ష” కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని స్థానిక 34,35 డివిజన్ల లో శనివారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అర్హులకు సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే వుంది ధృవీకరణ పత్రం అందిస్తారన్నారు.34వ డివిజన్ లో 700 ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు.అక్కడిక్కడే ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు కృషి చేయడం జరిగిందన్నారు.గతంలో ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేదన్నారు. గత ప్రభుత్వం లో అందరికీ కాదు కొందరికే పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. నేడు జగనన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఇస్తున్నామాన్నారు. 11 రకాల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నామన్నారు.ప్రజల కి మంచి చేసేందుకే కృషి చేస్తున్నామన్నారు.నగర మేయర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అందించడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ముఖ్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “జగనన్న సురక్ష” పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి కోరారు.నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల వాలంటీర్లు తమకు సంభందించిన క్లస్టర్ నందు గల గృహాలను సందర్శించి, కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు నేటి నుంచి “జగనన్న సురక్ష” కార్యక్రమం ద్వారా అర్హులైన వారందరికీ లబ్ది చేకూర్చనున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బండి పుణ్యశిల, బలసాని మనెమ్మా, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల డివిజన్ నాయకులు కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు నగర పాలక సంస్థ మరియు రెవిన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *