ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రామ్వర్దంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ శిఖమని సెంటర్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దళితులు,పేదల అభ్యున్నతి కోసం బాబూ జగజ్జీవన్ రామ్ఎంతగానో కృషి చేశారని చెప్పారు.ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.ఆ మహనీయుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి  రాజ్యాంగానికి విలువనిస్తూ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో 50% పైబడి పదవులను వారికి కేటాయించి రాజ్యాధికారాన్ని ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధురి, అంబెడ్కర్,కో ఆప్షన్ మెంబెర్ అలీమ్ వైస్సార్సీపీ నాయకులు సంపత్, రాజ్ కమల్, కుటుంబరావు, సుమన్, అగస్టీన్, ధనరాజ్, సుదీర్, సౌమ్య, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *