Breaking News

జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి : జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో జరుగనున్న 15ఆగస్ట్23 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించాలని అందుకు సంబందించిన శాఖలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు. పెరేడ్ గ్రౌండ్ లో వసతుల కల్పన పై ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించి గ్రౌండ్ ను సిద్ధం చేయాలని సూచించారు. వివిధ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు, శకటాల ప్రదర్శన చేపట్టాలని సూచించారు. విద్యా శాఖ, సమాచార శాఖ సంయుక్తంగా పాఠశాలల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు వంటివి చూడాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుండి ప్రగతి నివేదికలను క్లుప్తంగా జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయానికి రేపటికల్లా అందేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం నుండి జిల్లాకు కేటాయించబడిన మంత్రి వర్యులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రగతి పై సందేశం ఇస్తారని, అందువలన తమ శాఖల నుండి ప్రగతి నివేదికలను సత్వరమే పంపాలని సూచించారు. స్వాతంత్ర్య వేడుకల సమయం లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్ ఏర్పాటు వంటివి విద్యుత్ శాఖ చూడాలని తెలిపారు. పెరేడ్ గ్రౌండ్ అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఉండాలని అన్నారు.

ఈ సమీక్షలో డి.ఆర్.ఓ కోదండ రామిరెడ్డి, అడిషినల్ ఎస్.పి కుల శేఖర్, ఎస్దిసి భాస్కర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *