విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నగరాల కులస్తుల్ని బీసీలుగా పరిగణించాలని గురువారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రతిపాదించినట్లు వెలంపల్లి కార్యాలయం నుండి గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా అసెంబ్లీ లో వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నగరాల సామాజిక వర్గాన్ని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీ లలో చేర్చారని అయితే అది కొన్ని జిల్లాలలో ఉండే నగరాలకు మాత్రమే వర్తిస్తుందని మరి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి గతంలో నగరాల సామాజిక వర్గ నాయకులతో కలిసి తీసుకురావడం జరిగిందన్నారు.అయితే ఆ ప్రక్రియను త్వరితగతిన అమలు లోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నివసించే నగరాలను బీసీలుగా పరిగణించాలని కోరారు.
Prajavartha Online Telugu News