రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రిలో గురువారం 26వ అఖిల భారత పొగాకు నెట్ వర్క్ ప్రాజెక్ట్ సమావేశాలు 21. 9 2023 న CTRI సెమినార్ హాల్ లో నిర్వహించబడినవి.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డా డి.కె. యాదవ, Assistant Director General (Seeds)ICAR , New Delhi ఆన్లైన్ లో పాల్గొన్నారు.ఈ ప్రారంభోత్సవ సమావేశానికి CTRI డైరెక్టర్ మరియు AINPT ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డా. మాగంటి శేషు మాధవ్ అధ్యక్షత వహించగా డా. కె. సరళ, నోడల్ ఆఫీసర్, AINPT , డా. టి.జి.కె. మూర్తి, పూర్వపు డైరెక్టర్, డా. యూ. శ్రీధర్, పూర్వపు సస్యరక్షణ విభాగ అధిపతులు, మరియు డా. సి. చంద్రశేఖర రావు, పూర్వపు మృత్తిక విజ్ఞాన విభాగపు అధిపతి టెక్నికల్ నిష్ణాతులుగా పాల్గొన్నారు.ఈ సమావేశానికి AINPT 14 కేంద్రాల నుండి శాస్త్రవేత్తలు, CTRI శాస్త్రవేత్తలు, Tobacco Board Executive Director డా. ఏ. ధర్ బాబు, ఐఏఎస్, డా. రేణు, ప్రధాన శాస్త్రవేత్త, ICAR ఆన్లైన్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్రేడ్ మరియు స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.డా. ఎం. శేషు మాధవ్, డైరెక్టర్, CTRI , AINPT కేంద్రాలు సాధించిన పరిశోధన ఫలితాలను వివరించారు. డా. టి.జి.కె. మూర్తి మాట్లాడుతూ పొగాకు జెర్మ్ ప్లాస్మ్ సంరక్షణలో breeders పాత్ర ఎంతో ముఖ్యమైనదని వివరించారు. అంతేకాకుండా AINPT కేంద్రాల అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయాలనీ సూచించారు. డా. యూ. శ్రీధర్ మాట్లాడుతూ AINPT ద్వారా విడుదల కాబడిన 5 పొగాకు వంగడాలు రైతు స్థాయిలో అత్యధిక దిగుబడులు సాధిస్తూ రైతుల మన్ననలు పొందాయని భవిష్యత్తులో మరిన్ని వంగడాలు AINPT కేంద్రాల ద్వారా అభివృద్ధి జరగాలని కోరారు. డా. సి. చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఎక్కడైతే దిగుబడుల సమతుల్యత లోపించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పరిశోధనా దిశా నిర్దేశం చేయవలసిందిగా సూచించారు.డా. డి.కె. యాదవ, ADG (సీడ్స్) సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పొగాకులో హానికరమైన పదార్ధాలు తగ్గించే విధంగా పరిశోధన జరగాలని ముఖ్యంగా చూయింగ్ మరియు పొగ రకాలలో నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేసే దిశగా శాస్త్రవేత్తలు తమ కార్యాచరణ ప్రణాలికను రూపకల్పన చేసుకోవాలని సూచించారు. పొగాకు సాగులో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ సాగు ఖర్చును తగ్గించుకోవాలని వివరించారు.
Prajavartha Online Telugu News