Breaking News

రీ సర్వేపై సిసిఎల్ఏ సమీక్ష

– ఫేజ్ – 2 స్టోన్ ప్లాంటేషన్ సెప్టెంబర్ 30 కి పూర్తి కావాలి
-ఫేజ్ – 3 ద్వారా 90 గ్రామాల్లో రీ సర్వే
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫేస్ 2 కింద పెండింగ్ లో ఉన్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి సంబంధించిన భూ హక్కు పత్రాల పంపిణీ, స్టోన్ ప్లాంటేషన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే.మాధవీలత అధికారులను ఆదేశించారు.గురువారం రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్ర‌ధాన కార్యదర్శి, సిసిఎల్ఏ జి.సాయిప్రసాద్..సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి విజయవాడ సీసీఎల్ఎ కార్యాలయంలో నుంచి రీ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్, డి ఆర్వో జీ.నరసింహులు, జిల్లా సర్వే అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీసీఎల్ఏ ప్రత్యేక ప్ర‌ధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి ఫేజ్ -3 రీ సర్వే పూర్తి చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ గావించి ఫైనల్ ఆర్వోఆర్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం నాటికి ఫేస్ 2 కింద పెండింగ్లో ఉన్న భూ హక్కు పత్రాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.వీసీ అనంతరం జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. రీ సర్వే పనులు పూర్తైన గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్ర‌ధానంగా సరిహద్దు రాళ్లు వేసే ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు‌. జిల్లాకు ఫేజ్- 2 కింద 53,552 సరఫరా చేయాల్సి ఉండగా, 51,898 జిల్లాకు చేరాయన్నారు. ఇప్పటి వరకు 45,782 ప్లాంటేషన్ పూర్తి చేశారని, మిగిలినవి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇందుకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనుల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఫేస్ 2 కింద 22313 భూహక్కు పత్రాలను పంపిణీ చేసామని మిగిలినవి త్వరితగతిని పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకు ఈకేవైసీ 65.59 శాతం చేసామని మరో 34.41 శాతం చేయాల్సిఉందన్నారు. ఫేజ్ 3 లో 90 గ్రామాల్లో రీసర్వే కు సంబందించి ఫైనల్ ఆర్వోఆర్ డిశంబరు 31 నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టరు సర్వే మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వి ఆర్ వో, తహశీల్దార్ లకు చెందిన లాగిన్ లో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చొరవ చూపాలని మాధవీలత స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి. నరసింహులు, ఏడీ సర్వే ఎల్.లక్ష్మణరావు, కలెక్టరేట్ సిబ్బంది, తాహాసిల్థార్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *