విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం క్రిష్ణలంక నక్షత్ర హోటల్ నందు మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, గృహ సారథులు, క్లస్టర్ ఇన్ ఛార్జ్లతో జరిగిన సమీక్ష సమావేశం లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆంధ్ర కు జగనే ఎందుకు కావాలి (వై ఏపి నీడ్స్ జగన్) కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశము చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం మొదలుఅయ్యాక తరువాత రోజు నుండి వైసీపీ నాయకులు అందరూ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వారికి సవివరంగా తెలియజేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని ఏకమై మంచి చేస్తున్న ప్రభుత్వం మీద చేస్తున్న విష ప్రచారాన్ని త్రిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించడం మన బాధ్యత అని అన్నారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా వారి ఇంటి గుమ్మం వద్దకే పెన్షన్లు, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది అందజేస్తున్నామని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన ను ప్రజలకు చేరువ చేసిన గొప్ప నాయకడు జగనన్న అని కొనియాడారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలతో ప్రజల్లో ఆదరణ పొందుతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారు అవినీతి లో కూరుకుపోయి జైలు పాలు అయ్యారని విమర్శించారు. టీడీపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి అసత్య ప్రచారాలు, ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ఆ పార్టీ నాయకులు మహిళలు అని కూడా చూడకుండా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను బూతులు తిడుతూ మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. మరలా జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుంది అని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అవినాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషగిరి రావు,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,కార్పొరేటర్లు ఉమ్మడిశెట్టి బహదూర్,తంగిరాల రామిరెడ్డి,పుప్పాల కుమారి,తాటిపర్తి కొండా రెడ్డి,మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు,డివిజన్ ప్రెసిడెంట్లు,మండల ఇంచార్జ్ లు,గృహ సారథులు,కన్వీనర్లు,వాలంటిర్లు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …