వైద్యరంగంలో సరికొత్త ఒరవడి జగనన్న ఆరోగ్య సురక్ష

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య రంగంలో సరికొత్త ఒరవడి అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రామకృష్ణాపురంలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో డిప్యూటీ మేయర్ అవుతుశైలజారెడ్డి, డీఎంహెచ్ఓ సుహాసిని, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన వారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను సైతం పరిష్కరించే దిశగా అనుభవం ఉన్న వైద్యులతో ప్రజలకు చికిత్స అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిస్థాయిలో అన్ని రకాల పరీక్షలు చేసి.. ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 6,729 మంది ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగపరచుకోగా.. వీరందరికీ 5,824 టెస్టులు, 2,021 మందికి కంటి పరీక్షలు, 715 మందికి ఈసీజీ టెస్టులు నిర్వహించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరిలో 715 మందిని మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 30వ డివిజన్లోని 246 వ వార్డు సచివాలయ పరిధిలో 1,243 గృహాలను ఇంటింటీ సర్వే ద్వారా ఆరోగ్య సిబ్బంది సందర్శించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 3,064 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 550 మందికి టోకెన్లు అందజేసినట్లు వెల్లడించారు. మరోవైపు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వ్యవస్థ పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుదారుల సౌలభ్యం కోసం ఓ మొబైల్ యాప్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అర్థరాత్రి వేళల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు సద్వినియోగపరచుకునేలా.. ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిందని మల్లాది విష్ణు అన్నారు. అలాగే రామకృష్ణాపురం ప్రజలకు మూడు వైపులా దేవీనగర్, అయోధ్యనగర్, ఇందిరానాయక్ నగర్లో మూడు అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. ఈ సేవలన్నింటినీ సద్వినియోగపరచుకుని ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *