Breaking News

ట్రాయ్ యాప్ లో “వివాహ వేదిక” ప్రారంభం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాయ్ యాప్ లో పెళ్లి సంబంధాల పరిచయ వేదిక “వివాహ వేదిక” ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన నగర ప్రముఖులు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన అభ్యర్థి గుండువల్లి నతీష్, సుంకర ఆదినారాయణ, శశిప్రభ చేతులు మీదుగా ప్రత్యేక అతిథి కీర్తి రామకృష్ణ చేతులు మీదుగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుపల్లి సతీష్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న యువతి, యువకులకు, వారి కుటుంబ సభ్యులకు మంచి పెళ్లి సంబంధాలు తెలుసుకునేందు కోసం ఈ ట్రాయ్ యాప్ అందరికి వెసులుబాటులో ఉంటుందన్నారు. వక్తలు మాట్లాడుతూ ట్రాయ్ యాప్ లో ప్రవేశ పెట్టిన కాపుల పెళ్లి సంబంధాలకు పరిచయ వేదికకు సరిఅయిన వేదిక అని, మన రాయల సోదరులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లలకు మంచి సంబంధాలు కలుపుకుని వారి వివాహ జీవితం అప్లైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *