Breaking News

రేపు శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం….. ఎమ్మెల్యే కొడాలి నానిను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

-దేవస్థాన వైభవాన్ని పెంపొందించేలా బాధ్యతతో కమిటీ సభ్యులు పనిచేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని….

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం 12వ తేదీ మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో జరుగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బాధ్యతలు చేపట్టనున్న కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నానిను ఆహ్వానించారు. రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే నానీకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను అందజేశారు. ధర్మకర్తల కమిటీ సభ్యులు బాధ్యతతో పనిచేస్తూ , దేవాలయాల వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే నాని అన్నారు.ప్రజల్లో భక్తి భావజాలం పెంపొందేలా , దేవాలయాల్లో విరివిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా కమిటీలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ గా నియమితులైన పంచకర్ల వెంకట్, కమిటీ సభ్యులుగా నియమితులైన పొదిలి సత్యనారాయణ, గానుగుల సరళరేఖ, దారం కాంచన కుమారి, నూకల లక్ష్మీ శివ జ్యోతి, చందల వజ్రలత,లక్కోజు శివ ప్రసాద్,వైఎస్ఆర్సిపి నాయకులు పాలేటి చంటి, వేంపల అప్పారావు, జ్యోతుల శ్రీను,చంద్రాల హరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *