Breaking News

గోపాలపురం మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
గోపాలపురం మండలంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మొదటిగా గోపాలపురం గ్రామంలో 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో గోపాలపురం నుండి గుడ్డిగూడెం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. కోమటిగుంట గ్రామంలో 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పి.జే. రోడ్డు నుండి కోమటిగుంట వరకు రహదారికి  శంకుస్థాపన చేశారు. కరిచర్లగూడెం గ్రామంలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కరిచర్లగూడెం  నుండి సంజీవపురం పోవు రహదారికి శంకుస్థాపన చేశారు. పెద్దాపురం గ్రామంలో 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పెద్దాపురం నుండి బంధపురం వరకు రహదారికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమాలు అనంతరం భీమోలు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *