Breaking News

తూర్పు గోదావరి జిల్లాలో పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

-పార్లమెంట్ పరిధిలో నామ పత్రాల పరిశీలనను పరిశీలించిన అబ్జర్వర్ కె. బాలసుబ్రమణ్యం
.. కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలో శుక్రవారం రాజమండ్రి పార్లమెంటుకు జిల్లాలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాలకు సంబందించి రిటర్నింగ్ అధికారులు ఈ నెల 18 నుంచి 25 వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేసిన ఆయా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్న నామ పత్రలను ఆమోదించడము, ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేని నామ పత్రాలను తిరస్కరణ జరచేయడం జరిగిందని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత తెలిపారు. ఇందుకు సంబందించి ఆయా కారణాలను సంబందిత ప్రతినిధులకు తెలియజేశారన్నారు.

ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సక్రమంగా ఉన్న నామినేషన్ల నామ పత్రములు :-

1) బహుజన సమాజ పార్టీ – గణేశ్వరరావు పరమట, 2) భారతీయ జాతీయ కాంగ్రేస్ – గిడుగు రుద్రరాజు, 3) వైఎస్సార్ సీపి – డాక్టరు గూడూరి శ్రీనివాస్ 4) బీజేపి – దగ్గుబాటి పురంధేశ్వరి,5) నవరంగ కాంగ్రెస్ పార్టి – బత్తుల బలరామ కృష్ణ 6) రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్)- మేడా శ్రీనివాసరావు 7) జై భారత్ నేషనల్ పార్టీ – మోహనరావు శింగులూరి… స్వతంత్ర అభ్యర్థులుగా 8) జల్లి బాలనవీన 9) బొమ్మనబోయిన విఎస్ఆర్ మూర్తి 10) భానుచందర్ కురువెళ్ళ 11) డాక్టరు మెడిసి రత్నారావు అలియాస్ వినయ్ 12) సాళోపంతుల రాఘవేంద్రరావు.

నామినేషన్లు తిరస్కరించిన అభ్యర్థులు :– వైఎస్సార్ సీపీ 1) గూడూరి రాధిక 2) రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (A) – వారా ప్రభాకర్ 3) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ – చేబ్రోలు చైతన్య 4) ఫిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా విజయ భాస్కర లక్ష్మి పులగం 5) యుగతులసి పార్టీ – కోటగిరి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థులు 6) కొల్లపు వేణు7) గొలుగూరి వెంకట లక్ష్మీ నారాయణ రెడ్డి

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *