Breaking News

లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన‌ నగరాల ప్రముఖులు

-కూటమి విజయానికి వలసలే నిదర్శనం, చంద్ర‌బాబు సీఎం కావటం త‌ధ్యం : టిడిపి ఎంపి అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్
-కేశినేని చిన్ని నేతృత్వంలో పార్టీలోకి భారీగా చేరికలు
-పార్టీలో చేరిన 400 కుటుంబాలు

ఉండ‌వ‌ల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది..చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాబోతున్నారు. దీనికి వైసిపి వీడి టిడిపిలోకి వ‌స్తున్న నాయ‌కులే నిదర్శనం. విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో రానున్న రోజుల్లో మ‌రెంద‌రో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టిడిపిలో వ‌చ్చేందుకు సిద్దంగా వున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. కేశినేని శివ‌నాథ్ నేతృత్వంలో విజ‌య‌వాడకు చెందిన న‌గ‌రాల సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌రుపిళ్ల చిట్టి మ‌న‌వ‌డు గుజ్జ‌రి అమ‌ర్ బాబు, మాజీ మేయ‌ర్ తాడి శకుంత‌ల శుక్ర‌వారం యువ‌నేత లోకేష్ ను ఉండ‌వ‌ల్లి లో వారి నివాసంలో క‌లిశారు. లోకేష్ స‌మ‌క్షంలో వీరంతా టిడిపిలో చేరారు. ఎంపి అభ్యర్థి కేశినేని శివ‌నాథ్ నాయ‌క‌త్వంలో సుమారు 400 కుటుంబాలు తరలివచ్చి పార్టీ కండువా క‌ప్పుకున్నారు. వీరంద‌రికి లోకేష్ పార్టీ కండువా కప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ బలహీనవర్గాలకు పుట్టినిల్లు లాంటిది, టిడిపి ద్వారానే బలహీనవర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఏనాడు బిసిలపై దాడులు, వేధింపులు లేవు. జగన్ అధికారంలోకి వచ్చాక 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బిసి రక్షణ చట్టంతో బలహీనవర్గాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే బిసి డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు.

అనంత‌రం కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమరభేరీ మోగినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తల్లోనే కాదు నాయ‌కుల ఆలోచ‌న‌ల్లో మార్పు మొద‌లైంద‌న్నారు. జ‌గ‌న్ విధానాలు నచ్చక వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో లింగిపిల్లి అప్పారావు (అధ్యక్షుడు, శ్రీ నగరాలు దేవస్థానం), పిల్లా శ్రీనివాసరావు (కోశాధికారి, శ్రీ నగరాలు దేవస్థానం), రాంపిళ్ల శ్రీనివాసరావు (గౌరవాధ్యక్షులు, నగరాలు ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్), ఈడి ఎల్లరాజారావు (మాజీ సెక్రటరీ, శ్రీనగరాలు దేవస్థానం), లింగిపిల్లి రామకృష్ణ (అధ్యక్షుడు, శ్రీనగరాలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ), బెవర సూర్యనారాయణ (గౌరవాధ్యక్షుడు , శ్రీనగరాలు దేవస్థానం) అడ్డూరి రాము (అధ్యక్షుడు, కృష్ణాజిల్లా నగరాల సంఘం), కమందుల నరసింహారావు (కార్యదర్శి, కృష్ణాజిల్లా నగరాలు సంఘం), గుడెల శ్రీనివాసరావు (మాజీ అధ్యక్షుడు, కృష్ణాజిల్లా నగరాలు సంఘం), పిల్లా విజయ్ కుమార్ (కోశాధికారి, నగరాలు ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్), తమ్మిన సూర్య జయనారాయణ రావు (మాజీ కోశాధికారి, ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం), బయన అచ్యుతరావు, బయన వెంకటరావు, సుకాసి శ్రీనివాసరావు, మజ్జి సాంబశివరావు, నాగోతి వాసు, నాగోతి రవి కుమార్, గర్రె మురళీ మోహన్, చింతాడ బాలకృష్ణ, మరుపిళ్ల సత్తిబాబు, కోరికని దివాకర్, మాకిన సత్యనారాయణ, చీపిళ్ల వెంకటేశ్వరరావు, దేవిన సతీష్, మరుపిళ్ల వాసు, గూడేల వెంకటరమణ, బాయన రమాదేవి (మాజీ కార్పొరేటర్), బాయ్ అను వెంకటరావు, గూడెల రామకృష్ణ (ఆర్. కె), మురిపిళ్ళ దాలినాయుడు, ఆడ్డూరి రాము, చొక్కర లక్ష్మణరావు, గూడెల అప్పారావు, ఇలిపిళ్ళ వాసు, గూడెల త్రినాధ్, బంక జనార్ధన్, పట్నాల వేణుగోపాల్, పట్నాల జయరాం, బొల్లి శ్రీనివాసరావు, బొల్లి జయప్రకాష్, కరణం యోగేశ్వరరావు, పొట్టా శ్రీనివాసరావు, మజ్జి రాము, రాజగిరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *