మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచారం లో చురుకుగా దూసుకుపోతున్న యువనేత వసంత ధీమంత్ సాయి. శనివారం రాత్రి మైలవరం పట్టణం లో యాదవ బజారులోని పలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువనేత ధీమంత్ బాబు స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ణప్తి చేశారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) లను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. యువనేత ధీమంత్ సాయి ఎన్నికల ప్రచారంలో జనసేన తెలుగుదేశం బీజెపీ నాయకులు కార్యకర్తలతో పాటు తెలుగు యువత ఐటిడిపి TNSF నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News