Breaking News

35వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం….

-గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడులో పర్యటన
-సీఎం జగన్ కు మద్దతుగా…. ఐదోసారి కూడా ప్రజలు నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి…
-35రోజులుగా గడపగడపకు ప్రచారం చేస్తున్న తనపై…. ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది…
-మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు… రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని…
-అధికారం కోసమే ముగ్గురూ కలిశారు…. ప్రజల కోసమే జగన్ పోరాడుతున్నారు…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 35వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నాని బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ముందుగా గ్రామ పొలిమేరలో ఎమ్మెల్యే కొడాలి నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వలివర్తిపాడు గ్రామ వీధుల్లో గజ మాలలతో ప్రజానీకం….వైసిపి శ్రేణులు ఎమ్మెల్యే కొడాలి నానికు ఘన స్వాగతం పలికారు.ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజానీకం అభినందనలు తెలిపారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే నాని పూలమాలలతో నివాళులర్పించారు. వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీపై పూల వర్షాలు కురిపిస్తు పార్టీ నాయకులు… అభిమానులు జన స్వాగతం పలుకుతున్నారు. పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. మేనిఫెస్టో తమకు సంబంధం లేదని బిజెపి తప్పుకోవడంతో… రాష్ట్రంలో కూటమి సర్కస్ మొదలైందని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారని కొడాలి నాని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారని ప్రశ్నించారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని.. ఇప్పుడెందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారని కొడాలి నాని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఐదోసారి కూడా తనను ఆశీర్వదించి సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై నొక్కి…. ఎమ్మెల్యేగా నన్ను…. ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రచారంలో గుడివాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, జడ్పిటిసి గొళ్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, గుడివాడ మండల సచివాలయాల కన్వీనర్ కారే జోసెఫ్.
వలివర్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
శాయన నాగబాబు, చింతా శ్రీనివాసరావు, పెద్ద శివాలయం చైర్మన్ పంచకర్ల వెంకట్, ఖండవల్లి రవితేజ కుమార్, కలపాల కిరణ్ కుమార్, మన్నెం మహిధర్, గుడివాడ రమేష్, కలపాల స్వరూప్, పెటేటి నాగరాజు, చింతా రత్న శేఖర్, పంచకర్ల పెద్దిరాజులు, మాజీ సర్పంచ్ శాయన అనసూయమ్మ, పాలంచు విజయబాబు, గుడివాడ రాము, జువ్వలపూడి దినేష్,
గుడివాడ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పిటిసి చిన్ని దుర్గాప్రసాద్, పిల్లి బెనర్జీ, మేకల సత్యనారాయణ, ఏలేటి ఆగస్టు, గుడివాడ ప్రభాకర్,గిరి బాబాయ్, తోట రాజేష్, ఘంటా సురేష్, నల్లమోతు జగదీష్, చుండూరి శేఖర్, చుండి బావి, పుల్లేటికుర్తి కృష్ణ, అబ్దుల్ రజాక్, కర్రే నాని, చింతాడి నాగూర్, బేతపూడి నవరత్నరాజు, పులిమెట్ల సంతోష్,నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *