-జిల్లాకు చెందిన 98 వేల 550 మంది రైతుల ఖాతాలో జమ కానున్న రూ.19.71 కోట్లు
-కలెక్టరు మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 జూన్ 18వ తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే ‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు PM-KISAN పథకం యొక్క 17వ విడతను విడుదల చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 98,550 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ. 19.కోట్ల .71 లక్షలు జమ కానున్నట్లు తెలియ చేసారు. రైతుల్లో ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు, జిల్లాలోని అన్ని ప్యాక్స్ లలో సాయంత్రం 4:00 నుండి 7:00 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ప్రసారానికి హాజరు కావడానికి సమీప ప్రాంతాల నుండి గణనీయమైన సంఖ్యలో రైతులు పాల్గొనడం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్..మాధవ రావు తెలియ చేసారు. ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసార వెబ్ టెలికాస్ట్ https://pmindiawebcast. nic.in/ సా. 5:00 నుండి సా .6:00 వరకు ప్రత్యేకంగా జిల్లాలోని 107 ప్యాక్ సొసైటీ లలో ఏర్పాట్లు చెయ్యనున్నట్లు తెలిపారు.