Breaking News

17 వ విడత పి ఎం కిసాన్ పథకం నిధుల విడుదలకు సంసిద్ధం

-జిల్లాకు చెందిన 98 వేల 550 మంది రైతుల ఖాతాలో జమ కానున్న రూ.19.71 కోట్లు
-కలెక్టరు మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 జూన్ 18వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే ‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు PM-KISAN పథకం యొక్క 17వ విడతను విడుదల చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 98,550 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ. 19.కోట్ల .71 లక్షలు జమ కానున్నట్లు తెలియ చేసారు. రైతుల్లో ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు, జిల్లాలోని అన్ని ప్యాక్స్ లలో సాయంత్రం 4:00 నుండి 7:00 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష ప్రసారానికి హాజరు కావడానికి సమీప ప్రాంతాల నుండి గణనీయమైన సంఖ్యలో రైతులు పాల్గొనడం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్..మాధవ రావు తెలియ చేసారు. ఈవెంట్ యొక్క ప్రత్యక్ష ప్రసార వెబ్ టెలికాస్ట్ https://pmindiawebcast. nic.in/ సా. 5:00 నుండి సా .6:00 వరకు ప్రత్యేకంగా జిల్లాలోని 107 ప్యాక్ సొసైటీ లలో ఏర్పాట్లు చెయ్యనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *