-జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం.
-జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన..
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2 వ తేదీ వరకు లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ ఇంటింటి సర్వే సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి వైద్యాధికారులు, జిల్లా అధికారులతో కలిసి జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసి కేసు డిటెక్షన్ కాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని, దీనితోపాటు కొన్ని వైరస్ లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉన్న వెంటనే వైద్యులు సంప్రదించి తొలి దశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునన్నారు. కుష్టి వ్యాధి పట్ల ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయవద్దని, వ్యాధి తీవ్రత పెరిగితే వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. కావున కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించే విధంగా ఆరోగ్యశాఖ అధికారులతో పాటు సమన్వయ జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా వైద్యకారి డా. కే.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను, యు పి హెచ్ ల వైద్యులు వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిని నియంత్రించే విధంగా సస్పెక్ట్ కేసులను సర్వేని సక్సెస్ చేయమని కోరారు.
జిల్లా అదనపు వైద్యాధికారి డా . ఎన్ . వసుంధర మాట్లాడుతూ జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీలో ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు 1308 టీములు ఆశ వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు .
గత ఎల్సిడిసి సర్వేలు కన్నా మెరుగైన విధంగా సర్వే చేసి ఎక్కువ కేసులు వచ్చే విధంగా పీహెచ్ సి యు పి హెచ్ సి వైద్యాధికారులు ప్రజలకు అవగాహనతో పాటు వైద్య సేవలందించాలన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి పూర్తి నిర్ములనకు జిల్లా యంత్రంగా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.
** కుష్ఠు వ్యాధి లక్షణాలు:-
.. చర్మంపై స్పర్శలేని, నొప్పి లేదా దురద లేని మచ్చలు.. చర్మంపై ఎర్రని లేదా రాగిరంగు మచ్చలు.. చెవులపై, వీపుపై, ఎదపై నొప్పిలేని బుడిపెలు..కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం..కనుబొమ్మల మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం..నొప్పిగా ఉన్న నరములు చేతులు, పాదాలు,నరాలయందు తిమ్మిర్లు కలిగి ఉండడం..చేతులు, పాదాలయందు నొప్పి తెలియని గాయాలు లేదా పుండ్లు కలిగి ఉండడం…చేతివేళ్ళు, కాలివేళ్ళు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం.. చల్లని లేదా వేడి వస్తువులు గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం వంటి లక్షణాలతో కృషి వ్యాధి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్, డిఆర్ఓ జీ నర్సింహులు, డి ఎం హెచ్ ఓ డా. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్వో, డా. ఎన్ వసుంధర, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News