విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1. నిన్నటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంనకు ప్రయాణించి ఈరోజు అనగా 2024 జూలై 20 న ఉదయము 0 8 .30 గంటలకు గడచిన 3 గంటల్లో అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. ఈ వాయుగుండం పూరీ (ఒడిశా) కు నైరుతి దిశగా 40 కిలోమీటర్లు మరియు గోపాల్పూర్ (ఒడిశా) కు తూర్పు-ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా, చత్తీస్ గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది.
2 .సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, అజ్మీర్, దామోహ్, మాండ్లా, రాయ్పూర్ మీదుగా ఒడిశా తీరం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది .
3. షియర్ జోన్ లేదా గాలుల కోత సుమారు 20°ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది.
—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
ఈరోజు :-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది .
భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
రేపు;-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
ఎల్లుండి :-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
—————-
ఈరోజు :-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
రేపు ;-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.
ఎల్లుండి :-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
రాయలసీమ :-
—————-
ఈరోజు:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రేపు :-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది .
బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.