అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో నేడు శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపౌర్ణమి మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వేణుదత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుక పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను’’ అని చంద్రబాబు తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …