2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు..
రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు
ముద్రలోన్‌ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్
ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
MSMEలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు
త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్‌ రుణాలు
100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్‌

భారీగా పెరిగిన పన్నుశాతం
ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా పెరిగిన పన్నుశాతం
ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై 25 శాతం పెరిగిన పన్ను

స్టాక్‌మార్కెట్లకు బడ్జెట్‌ షాక్‌..
స్టాక్‌మార్కెట్లకు బడ్జెట్‌ షాక్‌..
కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
1200 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌
నిఫ్టీ 360 పాయింట్లు డౌన్‌

స్టాండర్డ్ డిడక్షన్ వారికి మాత్రమే..
ఆదాయపు పన్నుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచగా.. కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందుతారు.

కోత్త పన్ను విధానంలో మార్పులు..
సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు

కేంద్ర బడ్జెట్‌ – రూ.48.21 లక్షల కోట్లు
కేంద్ర బడ్జెట్‌ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
నూతన పింఛన్‌ విధానంలో త్వరలో మార్పులు
సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం

వేతనజీవులకు ఊరట..
స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ.. లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు
స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు

బడ్జెట్‌లో ఊరట
తగ్గనున్న బంగారం, వెండి ధరలు
సెల్‌ఫోన్లపై 15 శాతం కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
లెదర్‌ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు
మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు
ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు
25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
సోలార్‌ ఉత్పత్తులపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌

ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్‌ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్‌ విశ్వాస్‌ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
భవిష్యత్‌ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
యూఎల్‌ పిన్‌ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
ప్రతి భూకమతానికి యూఎల్‌ పిన్‌ నెంబర్‌ కేటాయింపు
ప్రతి భూకమతాన్ని భూ ఆధార్‌ ద్వారా గుర్తింపు
ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు

రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌
విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

ఉద్యోగాలు – నైపుణ్యాలు
ఐదు పథకాల కోసం PM ప్యాకేజీ
విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు
ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు
ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు

ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం
సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక

బిహార్‌కు బడ్జెట్‌లో నిధుల వరద
బిహార్‌లో రూ.21,400 కోట్లతో 2400 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌
ఎయిర్‌పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, స్పోర్ట్స్‌ సదుపాయాలు
బిహార్‌కు నిధుల కల్పనకు బ్యాంకుల ద్వారా రుణాలు

తయారీరంగానికి కేటాయింపులు..
MSMEలకు క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు
త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
తనఖాలు, గ్యారంటీలు లేకుండా యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్‌ రుణాలు

బడ్జెట్‌ థీమ్‌.. తొమ్మిది అంశాలు
వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం
మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం
తయారీరంగం, సేవలు
పట్టణాల అభివృద్ధి
ఇంధన భద్రత
మౌలిక వసతుల అభివృద్ధి
ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి
కొత్తతరం సంస్కరణలు

చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం

పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం
భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు

అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం
రూ.15 వేల కోట్లు కేటాయించిన కేంద్రం
వివిధ ఫైనాన్స్‌ సంస్థల నుంచి నిధుల కల్పన
పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం
ఆర్థికవృద్ధి కోసం అదనపు కేటాయింపులు

చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం

ఏపీకి వరాల జల్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం
వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన
రూ. 15 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం
అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు..

ఏపీకి గుడ్ న్యూస్..
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సదుపాయాలు, నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బిహార్, జార్ఖండ్‌తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పొడగింపు: ఆర్థిక మంత్రి*
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు

విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
మధ్యంతర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగుతున్నాయి
ఉద్యోగం, స్కిలింగ్‌, MSMEపై పూర్తిస్థాయి దృష్టి ఈ బడ్జెట్‌లో ఉంటుంది
వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యం
బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం
వ్యవసాయ పరిశోధనా రంగానికి ప్రాధాన్యత
కొత్తగా 109 వంగడాలను ప్రవేశపెట్టాం
వచ్చే ఏడాదిలోపు ప్రకృతి వ్యవసాయంలోకి కోటి మంది రైతులు
నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి
కూరగాయల ఉత్పత్తి కోసం భారీ స్థాయి క్లస్టర్ల అభివృద్ధి
వ్యవసాయరంగంలో స్టార్టప్స్‌కు ప్రోత్సాహం
వ్యవసాయ రంగానికి డిజిటల్‌ టెక్నాలజీ అనుసంధానం

వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ ప్రణాళికలు
పేదరికం, యువత, మహిళ, అన్నదాతలకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించాం
వ్యవసాయం, ఉద్యోగం,నైపుణ్యం, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, మౌలికసదుపాయాలకు అగ్ర తాంబూలం
ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది
దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచాం
కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం
విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తాం
నిర్మలా సీతారామన్

ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది
బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుంది
నాలుగు అంశాలపై మధ్యంతర బడ్జెట్‌లో దృష్టి పెట్టాం
ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం
ఉద్యోగం, స్కిల్, MSMEపై పూర్తిస్థాయి దృష్టి
వచ్చేఐదేళ్లలో 4 కోట్లమందికి ఉపాధికల్పించడం లక్ష్యం
బడ్జెట్‌లో తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం
నిర్మలా సీతారామన్

ఏడోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
పార్లమెంట్‌ ఉభయసభలు ప్రారంభమయ్యాయి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 2014 నుంచి మోదీ సర్కారుకు ఇది 13వ బడ్జెట్‌ కాగా.. ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ ఏడోసారి బడ్జెట్‌ ను ప్రవేశపెడుతున్నారు. 2047కల్లా వికసిత్‌ భారత్‌ అనే లక్ష్యానికి తగినట్లు బడ్జెట్‌ ను రూపకల్పన చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *