-కాలువలను ట్రక్సర్ ద్వారా పరిశుభ్రపరచుట, డ్రోన్ ద్వారా యం.ఎల్ ఆయిల్ స్ప్రే
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దోమల వల్ల కలుగు వ్యాధులను నివారించడానికి దోమల లార్వను కాలువల్లో నియంత్రించేందుకు ఆధునిక పద్ధతులను అనుసరించాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం రామకృష్ణాపురంలోని, బుడమేరు కాలువ పరిశీలిస్తూ, నిరంతరం వ్యర్ధాలు పేరుపోకుండా ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించేందుకు ట్రక్సర్ మెషిన్ ద్వారా శుభ్రపరచాలని, వ్యర్ధాలు పేరుకుపోయినచోట దోమల లార్వా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనుషులు వెళ్లలేని ప్రదేశాలలో డ్రోన్ల సహాయంతో యం ఎల్ ఆయిల్ స్ప్రే నిరంతరం స్ప్రే చేస్తూ దోమలని అరికట్టాలని. తద్వారా దోమల వల్ల కలుగు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు.
కెనాల్ బండ్ పైన ఉన్న వ్యర్ధాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచి, గ్రీనరీని అభివృద్ధి చేయాలని, కెనల్ చుట్టుపక్కల గ్రీనరీ పెంచడం ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా వాతావరణం లో కార్బన్ డయాక్సైడ్ ని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని, తద్వారా ఆక్సిజన్ శాతం పెరగటం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. విజయవాడ నగరంలో ఉన్న బందర్, ఏలూరు, రైవస్ కాలవల్లో ట్రక్సర్ వాహనం వినియోగిస్తూ పేరుకుపోయిన వ్యర్థాలను నిరంతరం తొలగిస్తూ, దోమల వ్యాప్తిని అరికట్టాలని అన్నారు.