విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిందు సేద్యానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంఐపి పథక సంచాలకులు పీ.ఎం సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ మరియు సింక్టర్లలకు ఆరువేల హెక్టార్లు లక్షంగా నిర్దేశించారన్నారు. ఇందుకు 19.82 కోట్ల రాయితీని కేటాయించడమైనదని ఆయన తెలిపారు. మెట్ట మరియు మాగాణి ఏదైనా 5 ఎకరాలలోపు 90% రాయితీ (రు.2.18 లక్షల వరకు), 5 నుండి 12.50 ఎకరాలలోపు 50% రాయితీ (రు.3.10 లక్షల వరకు) ఇవ్వటం జరుగుతుందన్నారు. డ్రిప్ మరియు స్పింకర్ల పరికరాలు పొందగోరు రైతులు ఆధార్ కార్డ్,1బి పత్రము, ఎఫ్ఎంబి మరియు బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని సమీప రైతు సేవా కేంద్రం / ఉద్యనాధికారి / పథక సంచాలకులు కార్యాలయంను సంప్రదించి నచ్చిన కంపెనీని ఎన్నుకొని బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల న్నారు. ఇతర వివరాలకు పథక సంచాలకులు ఏపీఎంఐపీ, ఎస్టిఆర్ జిల్లా వారిని 0866- 3500193, 79950 09910, 79950 09911. సంప్రదించవచ్చునని ఏపీఎంఐపి పథక సంచాలకులు పీ.ఎం సుభాని ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …