Breaking News

నందిగామ‌, నూజివీడు లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే కె.వి సంస్థ‌లు ప్రారంభించాలి

-కేంద్ర విద్యాశాఖ మంత్రి కి ఎం.పి. కేశినేని శివ‌నాథ్  విజ్ఞ‌ప్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ‌, కృష్ణ జిల్లా లోని నూజివీడులో గ‌తంలో మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని శివ‌నాథ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్ లోని ఆయ‌న ఛాంబ‌ర్ లో క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. 2023 సెప్టెంబర్ 22న జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ సమావేశంలో నందిగామ, నూజివీడ్ లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమ‌తి మంజూరైన‌ట్లు తెలియ‌జేశారు. నందిగామ, నూజివీడ్‌లో తాత్కాలిక భవనాల సిద్ధతపై కేంద్ర విద్యాలయ సంఘట‌న్ నివేదిక పంపమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్‌ను కోరిన విష‌యం, వారు ఆ నివేదిక త‌యారు చేసి డిప్యూటీ రీజినల్ కమిషనర్ పికెట్, సికింద్రాబాద్ పంపించిన విష‌యం…,ఇప్పుడు ఆ నివేదిక న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘ‌ట‌న్ కి చేరిన‌ట్లు త‌న విజ్ఞాప‌న ప‌త్రంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ వివ‌రించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ అభ్య‌ర్థ‌న‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *