‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం స్పూర్తి దాయకం

-కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త :
-రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి చొరవ అభినందనీయం
-రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యడం జరుగుతుంది
– కలెక్టరు పి ప్రశాంతి

కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం కుమారదేవారం లొని 150 ఏళ్ల పైగా వయస్సు ఉన్న వృక్షన్ని పునరుజ్జీవం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కుమార దేవరం గ్రామంలోకలెక్టర్ రోటరీ క్లబ్ ప్రతినిధులతో కలిసి వృక్షన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం” లో పురాతన వృక్ష సంపదను పునర్జీవనం తీసుకొచ్చేలాగా చేస్తున్న కృషి వృక్షాలు యొక్క ఆవశ్యతను తెలియ చేస్తోందని అన్నారు. పడిపోయిన , తొలగించిన వృక్షాలను సంరక్షించి తిరిగి యధావిధిగా వాటినీ నాటడం, సంరక్షించి వృక్ష సంపద కు నష్టం వాటిల్లకుండా రోటరీ క్లబ్, సభ్యులు చేపడుతున్న చర్యలు అభినందనీయం, స్పూర్తి నిచ్చే కార్యక్రమం అన్నారు.  గతంలో రెండు మొక్కలను కలెక్టరేట్ లో ఒక మొక్కను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి సంరక్షించినట్లు తెలిపారు. సినిమా చెట్టుగా 150 ఏళ్ల వయస్సు కలిగిన వృక్షం పడిపోవడం తో తిరిగి అక్కడే పునరుజ్జీవనం కోసం రోటరీ  క్లబ్ ఐకాన్స్ కృషిని అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వాటికి తమ పూర్తి సహకారం అందిస్తానని కలెక్టర్ పి ప్రశాంతి హామీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు లో ఈ ప్రాంతం పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పర్యాటకబారంగా మరింత అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ Rtn. తీగెల రాజా  మాట్లాడుతూ వృక్ష సంపదను భావితరాలకు అందించే క్రమంలో భవిష్యత్తులో కనీసం నెలకు రెండు చెట్లను తీసుకువచ్చి ఏదైనా ఒక సురక్షిత ప్రాంతంలో పాతడానికి ప్రణాళికలు వేస్తున్నామని , అందుకు అయ్యే ఖర్చును రొటీరియన్సే ఒక్కొక్కళ్ళు ఒక చెట్టు కి అగు ఖర్చుని అందిస్తున్నారని  బయటివారు కూడా వచ్చి ఆర్థిక తోర్పాట్లు ఇచ్చినట్లయితే వారి సంస్థల పేర్లు కానీ వారి పెద్దలు పేర్లు గాని ఆ చెట్టు వద్ద గ్రానైట్ పలకపై చెక్కించబడునని ఇది శాశ్వతంగా నిలిచిపోయి ఉండనని తెలిపినారు. ఈ కార్యక్రమంలో  సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా అటవీ అధికారి బి. నాగరాజు, ప్రెసిడెంట్ Rtn. తీగెల రాజా ,  సెక్రెటరీ Rtn.అను కుమార్ , జాయింట్ సెక్రెటరీ Rtn. Lion క్లబ్ డైరెక్టర్ లు రొటీరియన్స్ , తదితరులు పాల్గొనడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *