Breaking News

సింగ్‌నగర్‌లో నూతన బజాజ్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పాయకాపురంలోని కరెంట్‌ ఆఫీసు ఎదురుగా నూతన బజాజ్‌ షోరూంను నార్త్‌ జోన్‌ ఎసిపి రాజారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగ్‌నగర్‌లో అత్యాధునిక హంగులతో షోరూంను నిర్మించిన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. వరుణ్‌ మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి. వి.సత్యనారాయణ మాట్లాడుతూ నున్న పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపారు. సర్వీస్‌ అందించటానికి నూతన హంగులతో, అత్యాధునిక ‘2వీలర్‌ వర్క్‌షాప్‌’ మరియు ‘3వీలర్‌ వర్క్‌షాప్‌’తో కూడిన సేల్స్‌ Ê సర్వీస్‌ షోరూంని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ట్రైన్డ్‌ మెకానిక్స్‌, చేతక్‌ ఈవి సేల్స్‌, ఫైనాన్స్‌ సౌకర్యం, కొత్త వాహనం కొనుగోలు పై ఎక్స్చేంజ్‌ సౌకర్యం వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఈ రోజు 30 వాహనాలు డెలివరీ ఇస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక టూవీలర్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి కోనుగోలుదారు నున్న గ్రామానికి చెందిన తన్నీరు వెంకయ్యకు ఆర్‌ఎం కరుణ కరణ్‌ తాళాలు అందజేశారు. ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో సింగ్‌నగర్‌ సిఐ కృష్ణమోహన్‌, బజాజ్‌ కంపెనీ 2వీలర్‌ సర్వీస్‌ ఆర్‌ఎం. సచిన్‌ జైన్‌, సేల్స్‌ ఎఎస్‌ఎం సదత్‌ బాషా, సర్వీస్‌ ఎఎస్‌ఎం వంశీ, వరుణ్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ జీఎం పద్మజ, డిజీఎం వేమా శ్రీనివాస్‌, ఎజిఎం. వెంకట్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ తులసీరావు, సిబ్బంది మరియు కస్టమర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *