విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీకి చెందిన పావని అనే వికలాంగురాలికి సుజనా ఫౌండేషన్ ద్వారా సోమవారం ట్రై సైకిల్ అందజేసారు. పావని పుట్టుకతోనే వైకల్యంతో ఉందని నడవలేని పరిస్థితుల్లో ఉండటంతో ఎన్డీయే కార్యాలయాన్ని సంప్రదించి సాయం చేయాలని కొరగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజన ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచినేని కిరణ్, పదివేల విలువ గల ట్రై సైకిల్ బహుకరించారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది వికలాంగులకు చేయూతని ఇచ్చామని ఆ సంస్థ కోఆర్డినేటర్ వీరమాచనేని కిరణ్ తెలిపారు. పావని కుటుంబ సభ్యులు సుజన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …