Breaking News

స్వయం ఉత్పత్తి వ్యాపార కేంద్రాలుగా యస్ హెచ్ జి లు.

-యస్ హెచ్ జిల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రణాళికల సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
-చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రములోని స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి, వ్యాపార కేంద్రాలుగా మార్చే దిశగా ఆలోచిస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖల సమన్వయంతో ముందు సాగే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఈ అంశాలపై ఈరోజు సెర్ప్ సీఈవో వీర పాండ్యన్, మరియు ఎం ఎస్ ఎం ఈ శాఖల అధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో వివిధ రకాలుగా వచ్చే చెత్తను ఒక చోట చేర్చి, స్వయం సహాయక సంఘాల ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఒక మండలంలో పైలెట్ ప్రాజెక్టు గా బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ప్రాజెక్టును ప్రారంభించి నిర్వహించటం ద్వారా ప్రాథమికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించే విధంగా చర్యలు చేపటనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ఫ్లేటెడ్ ఫ్యాక్టరీస్ ను ప్రతి జిల్లాలో ప్రారంభించి, స్వయం సహాయక సంఘాలకు అద్దె ప్రాతిపదికన ఇస్తారు. యస్ హెచ్ జి లు తయారు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న107 ఉత్పత్తులను ఓ ఎన్ డి సి నెట్వర్క్ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు నైబర్ హుడ్ సర్వే జరుగుతున్న తీరును మంత్రి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 98% సర్వే పూర్తయినట్లు క్షేత్రస్థాయి అధికారులు మంత్రికి నివేదించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో వీరపాండ్యన్, చిన్న మధ్య తరహా పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *