అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు హెచ్‌సీఎల్ కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయమై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్‌తోపాటు ప్రతినిధుల బృందం సమావేశమైంది. కాగా, ఏపీలో హెచ్‌సీఎల్‌కు శంకుస్థాపన వేసింది.. సీఎం చంద్రబాబు నాయుడేనన్న సంగతిని నారా లోకేష్ గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో హెచ్‌సీఎల్ ప్రారంభం కాగా.. 4500 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ఈ భేటీ వివరాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. హెచ్‌సీఎల్ సంస్థ ఏపీలో కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నట్లు నారా లోకేష్ తెలిపారు. దీనివలన దాదాపు మరో 15 వేల ఉద్యోగాలు వస్తాయంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. హెచ్‌సీఎల్ సంస్థ విస్తరణకు కావాల్సిన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని.. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని నారా లోకేష్ వివరించారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …