Breaking News

ఘనంగా నక్కా రాములు, కోటేశ్వరమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ 7వ వార్షికోత్సవం

-విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దుస్తులు, నోట్‌పుస్తకాలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులను ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సీసీఈ విద్యా సంస్థల అధినేత కొమ్మూరు శ్రీధర్‌ అన్నారు. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ 7వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డు వద్ద శారదా కళాశాలలో ఆదివారం ఈ కార్యక్రమలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ ఆసక్తిగల సబెక్టును ఎంపిక చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ న్యాయవ్యాది, మాజీ కార్పోరేటర్‌ జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురైయ్యే అనుభవాలతో స్ఫూర్తి పొందాలన్నారు. ఓటమికి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం వరిస్తుందన్నారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ట్రస్ట్‌ నిర్వాహకులు నక్కా వీరభద్రరావు, రాజ్యలక్ష్మిలను అభినందించారు. శారదా జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎల్‌.శ్రీధర్‌, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఆంజనేయులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కారల్‌ షిప్‌లు, దుస్తులు, నోట్‌ పుస్తకాలు, విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. ప్రజాకళాకారుడు షేక్‌.నజీర్‌ అతిథులకు స్వాగతం పలికారు. స్ఫూర్తివంతమైన గేయాలు ఆలపించిన విద్యార్థులను ఉత్తేజితులను చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు మాలెంపాటి వెంకట కృష్ణయ్య, జడగం భాస్కర్‌, దుంపల నాగ నరసింహారావు, సీపీఐ నాయకులు తాడి పైడియ్య, మూలి సాంబశివరావు, కేఆర్‌.ఆంజనేయులు, సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *