-ఈ నెల 26న చెన్నైలో అవార్డు అందుకోనున్న బుద్ధప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సేవా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 26న చెన్నై రొయ్యపేటలోని మ్యూజిక్ అకాడమీలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సిల్వర్ జూబ్లీ వాలిడిక్టరీ సెలెబ్రేషన్స్, అవార్డ్స్ సెరెమనీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో వైద్య, రాజకీయ, నృత్య, సంగీత రంగాల్లో గుర్తింపు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. శ్రీ కళా సుధ వ్యవస్థాపక అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీజీఎన్ హోమ్స్ క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ – పద్మ దేవదాస్, పద్మభూషణ్ పీ.సుశీల, ఆచార్య సీఎంకే రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం, ప్రముఖులు విచ్చేయనున్నారు.