విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గోమాత సకల దేవతా స్వరూపమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదని పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవారని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవారని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవని.. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమని చెప్పారు. కృష్ణుని రూపం పూజలందుకునే ప్రతిచోటా వెనుకే గోమాత ఉంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలోనూ గృహప్రవేశాలు, ఆలయ కుంభాభిషేకాలు, ఇతర శుభకార్యాలలో ముందుగా గోవును ప్రవేశపెట్టే సంప్రదాయం నడుస్తోందన్నారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. శ్రీ కృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చాంద్ శర్మ, యల్లాప్రగడ సుధీర్, ఆర్కే, పసుపులేటి యేసు, వెన్నం రత్నారావు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …