అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లకు గుంటూరు నగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు మేకా తులసమ్మ రూ.5లక్షలు విరాళమిచ్చారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకురాలిగా సుదీర్ఘంగా సేవలందించి ఆమె ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందజేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …