Breaking News

దేశాభివృద్ధిలో ఛార్టడ్ అకౌంటెంట్ల పాత్రకీలకం

-అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
-ఐసిఎఐ జాతీయ అధ్యక్షులు రంజిత్ అగర్వాల్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక వ్యవస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని, ఆంధ్ర రాష్ట్రం అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఐసిఎఐ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సిఎ రంజీత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఐసిఎఐ విజయవాడ బ్రాంచి ఆధ్వర్యంలో రామ్నగర్ సిపిఐ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న రంజీత్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఐస్ఎఐ అనేది ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద అకౌంటింగ్ ప్రొఫెషనల్ బాడీగా ఉందని తెలిపారు.1949లో ఐసిఎఐసంస్థ ప్రారంభమైందని ప్రస్తుతం 75 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటుందని అన్నారు. 1600 మంది సభ్యుల నుండి నేడుదేశవ్యాప్తంగా 4లక్షలమందికి పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. 9.5 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం సిఎ కోర్సు చదువుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా 178 బ్రాంచీలు, ఐదు రీజనల్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఐసిఎఐ విజయవాడ బ్రాంచికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఈశాఖలో 1600మంది సభ్యులు, 3వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఐసిఎఐ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా 350 స్టడీ సర్కిల్స్ ఉన్నాయని, విజయవాడలో నూతనంగా స్టడీసర్కిల్ ప్రారంభించినట్లు తెలిపారు. దీనిద్వారా సిఎకోర్సు, పరీక్షల విదానం, సిలబస్ తదితర వాటిని గురించి తెలియచేస్తున్నామని తెలిపారు. రానున్న కాలంలోమరిన్ని స్టడీసర్కిల్స్ ను ప్రారంభించి సిఎ కోర్సును ప్రతి విద్యార్థికి అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తున్నామన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇతరదేశాలలో కూడా 50శాఖలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 42వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఐసిఎఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల శ్రీధర్, ప్రసన్నకుమార్ మరియు రామానగర్ స్టడీ సర్కిల్ కన్వీనర్ సిహెచ్ అమరుధీర్ మరియు ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ అడివి శివ ప్రసాద్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *