అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాగునీరు,జల్ జీవన్ మిషన్,పారిశుధ్యం,జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్ధేశించిన పధకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.అదే విధంగా పారిశుద్ద్య నిర్వహణ ప్రాజెక్టలను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.పలు రైల్వే,రోడ్డు ప్రాజెక్టులు,నూతన పైపులైను నిర్మాణ ప్రజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడి సిఎస్ లను ఆదేశించారు.అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సఫర్మేషన్ 2.0(అమృత్ 2.0)కింద పట్టణాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం,సీవరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులు,తాగునీటి వనరుల చుట్టూ పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్,రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,ఆర్ధికశాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్,స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు,మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …