అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి రహదారుల విస్తరణ,పరిశ్రమలకు అవసరమైన భూమి,విద్యుత్,రహదారులు,నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు,ఎపిఐఐసి, ఎపిఆర్డిసి,ఎపిట్రాన్సుకో తదితర విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.గురువారం రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రామ్ కు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామికా భివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం-చెన్నెఇండస్ట్రియల్ కారిడార్లో ఏర్పాటు అవుతున్న వివిధ పరిశ్రమలు,కంపెనీలకు అవసరమైన భూమి,మెరుగైన రహదార్లు,విద్యుత్,నీరు వంటి మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నెలవారీ,పనివారీగా భౌతిక,ఆర్ధిక లక్ష్యాల ప్రగతి నివేదికలను సిద్దం చేసి సమర్పిస్తే ఈనివేదికను ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సమర్పించి సకాలంలో మిగతా నిధులు మంజూరయ్యోలా చూస్తామని సిఎస్ చెప్పారు.
విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక నడవాకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి)నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాలుగా ఇప్పటి వరకూ ఎపిఐఐసి,ఎపి ఆర్డీసి,ఎపి ట్రాన్సుకో,జివిఎంసిలకు మంజూరు చేసిన నిధులు,ఇప్పటి వరకూ జరిగిన పనుల ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు.రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతో కీలకమైనదని కావున ఇందుకు సంబంధించిన పనులన్నీ వేగవతంగా నిర్వహించాలని సిఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కాగా వాటిలో మూడు ఆంధ్రప్రదేశ్ తో అనుసంధానమై ఉన్నాయని అవి విశాఖపట్నం-చెన్నై,చెన్నె-బెంగుళూరు,బెంగుళూరు-హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లని తెలిపారు.విశాఖపట్నం-చెన్నె పారిశ్రామిక కారిడార్ అభివృధ్ధికి సంబంధించిన పనుల భౌతిక, ఆర్ధిక లక్ష్యాల ప్రగతిని,ఇతర అంశాలను ఆయన వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ సిహెచ్.శ్రీధర్,ఎపి రోడ్డు డెవలప్మెంటె కార్పొరేషన్,ఎపి ట్రాన్సుకో,ఆర్ధిక,పరిశ్రమలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ గా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,ఎపిఐఐసి ఎండి అభిషిత్ తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …