Breaking News

ఈ నెల 1 వ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 3 కేంద్రాలు
-హాజరుకానున్న 821 మంది అభ్యర్థులు : జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్న యుపిఎస్సి కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్, నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని డి ఆర్ ఓ చాంబర్ నందు యూపీఎస్సీ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ…సెప్టెంబర్ 1 వ తేదీన యుపిఎస్సి ఆద్వర్యంలో జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి (II) 2024 పరీక్షలు గణితం పేపర్ ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు మధ్యాహ్నం సెషన్ జనరల్ ఎబిలిటీ పేపర్ 2 గం. నుండి సాయంత్రం 4.30 గం.ల వరకు ఉంటుందని తెలిపారు. అలాగే కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (II) 2024 పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఉదయం 9గం.ల నుండి 11 గం.ల వరకు, జనరల్ నాలెడ్జ్ పేపర్ మధ్యాహ్నం 12 నుండి 2 గం.ల వరకు ఉంటుందని, ఎలిమెంటరీ గణితం మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 5 గం.ల వరకు ఉంటుందని తెలిపారు. తిరుపతిలో మూడు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారని, 821 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు గదులు, త్రాగు నీరు, లైటింగ్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వివరాలు:
1) 50005 శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ చర్చ్ రోడ్డు, బాలాజీ కాలనీ తిరుపతి. (కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2024 కేంద్రం)

2) 50001 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి (నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) 2024 కేంద్రం)
3) 50002 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ -B ), తిరుపతి (నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) 2024 కేంద్రం)

ఈ కార్యక్రమంలో యుపిఎస్ సెక్షన్ ఆఫీసర్ శశి భూషణ్, తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, ఏ పి ఎం ఐ పి సతీష్, డిఎంహెచ్ ఓ డా. శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *