-నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
-నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ జమీల్ అహ్మద్‌బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గరల్స్ హాస్టల్‌లోని వాష్ రూమ్‌లలో హిడెన్ కెమెరాల ఘటన ఆందోళనకరమైన విషయమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇటుంటి ఘటనలు జరుగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. విద్యార్థినుల్లో మానసిక స్థైర్యం నింపాలంటే ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ కోరారు.