విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నుంచి కుండ పోతగా కురుస్తున్న భారీ వర్షాలపై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు.తుఫాను నేపథ్యంలో ఎన్టీఆర్ , కృష్ణా,జిల్లాల పరిస్థితులపై జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, పశ్చిమ నియోజకవర్గ తాసిల్దార్ ఇంతియాజ్ పాషా, ఇతర అధికారులతో సుజనా చౌదరి మాట్లాడారు. నాగార్జునసాగర్, పులిచింతల, ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేయడంతో, ప్రకాశం బ్యారేజీ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ సృజనకు ఎమ్మెల్యే సుజనా ఆదేశాలు జారీ చేశారు.మ్యాన్ హోల్, కరెంటు తీగలు, తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అన్ని శాఖలు అలర్ట్ గా ఉంటూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అస్నా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనె సమాచారం ఆందోళన కలిగిస్తుందని ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పూర్తి సహకారం అందించాలన్నారు. పశ్చిమ లోని కొండ ప్రాంత, లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎన్డీయే కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …