బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే ఉంటా

-ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం.
-1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడ్డాయి…విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
-వరద నష్టంపై కేంద్రాన్ని సాయం కోరుతాం.
-మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు
-నేడు, రేపు విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటానన్న సీఎం…నిద్రహారాలు మానైనా ప్రజల్ని ఆదుకుంటామని హామీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు సంభవించాయి. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగ్‌నగర్‌ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.’ ‘బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటా” అని బాధితులకు భరోసా కల్పించారు.

• బుడమేరుకు ఎక్కువగా వదర నీరు రావడంతో సింగ్ నగర్ ప్రాంతం ముంపునకు గురైంది.
• ఇంత పెద్ద ఇన్ ఫ్లో ఎప్పుడూ రాలేదు. 1998లో ఈ తరహా వరద వచ్చింది. 1998లో 9.24 లక్షల క్యూసెక్కులు వస్తే ఇప్పుడు ఇప్పుడు 9.70 లక్షల క్యూసెక్కులు వచ్చింది. గతం కంటే ఇప్పుడు 50 వేల క్యూసెక్కుల నీరు అధికంగా వచ్చింది.
• కృష్ణా బేసిన్ లో అన్ని రిజర్వాయర్లు నిండాయి. బుడమేరుకు వరద ఎక్కువగా రావడంతో సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోకి నీళ్లు వచ్చాయి.
• ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడింది.
• నాగార్జున సాగర్, పులిచింతల నుండి నీరు విపరీతంగా వస్తోంది. దీనికి తోడు మున్నేరు, బుడమేరు నుండి నీళ్లు రావడంతో వరద ఎక్కువైంది. కొల్లేరుకు నీరు వెళ్లే మార్గం గత ఐదేళ్ల పాటు సరిగా నిర్వహణ లేకపోవడంతో విజయవాడలోకి నీళ్ల వచ్చి చేరాయి.
• సింగ్ నగర్ కు బోట్ లో వెళ్లి బాధితులను పరామర్శించాను. వారి కష్టాలు చూసి వెళ్లడం ఇష్టం లేక న్యాయం చేసి, నమ్మకం కలిగిచేందుకు కలెక్టర్ కార్యాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.
• రేపు ఇక్కడే ఉంటా. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రితో కూడా మాట్లాడాను. 10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు రాష్ట్రానికి వస్తున్నాయి. 40 పవర్ బోట్లు కూడా రానున్నాయి. 10 హెలికాప్టర్ లు కూడా వస్తాయి..ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా వారిని ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. అడిగిన వెంటనే కేంద్రం స్పందించింది.
• హోటల్స్ యజమానులను, అక్షయపాత్ర వాళ్లను సంపద్రించి ఆహారం తయారు చేయాలని కోరాం. ఈ రాత్రికే ప్రతి ఒక్కరికీ ఆహారం, పాలు, బిస్కెట్లు, నీళ్లు అందించేందుకు సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రయత్నిస్తున్నాం.
• సింగ్ నగరలో 16 డివిజన్లలో, 77 సచివాలయాలు ఉన్నాయి. డివిజన్ కు ఒక సీనియర్ అధికారి, సచివాలయానికి ఒక జూనియర్ అధికారిని నియమిస్తాం. బాధితులు పూర్తిగా తేరుకున్న తర్వాతే ఇక్కడి నుండి వెళ్తాం.
• చిన్నారులు, వృద్ధులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సర్వశక్తులు వడ్డైనా బాధితులకు అండగా ఉంటాం.. రాత్రిళ్లు కూడా పని చేసి అన్ని విధాలా ఆదుకుంటాం. చివరి వ్యక్తి వరకూ న్యాయం చేస్తాం.
• బుడమేరుకు వచ్చే వరద ఎప్పటికి తగ్గుతుందో అంచనా లేనందున ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. గండ్లు పూడ్చేందుకు చర్యలు చేపట్టాం.
• 1997లో తూర్పు గోదావరిలో అరికేన్ తుపాన్, 2014లో విశాఖలో హుద్ హుద్ తుపాన్ వచ్చినప్పుడు అక్కడే ఉండి పరిస్థితి చక్కదిద్దాం.
• ఇప్పుడు కూడా ప్రజలు పిలిస్తే పలికే విధంగా ఉండాలనే కలెక్టరేట్ లో ఉన్నా. వరద తగ్గే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. చెరువులకు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
• విజయవాడలో అన్ని కళ్యాణ మండపాలు, హోటళ్లు అందుబాటులో పెట్టాం…ఎన్ని పునరావాస కేంద్రాలు అవసరమైనా వెనక్కి తగ్గం.
• ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం. ప్రతి గంటగంటకు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నాం.
• వరద నష్టంపై కేంద్రాన్ని సాయం కోరతాం.
• బాధితులకు కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్ 112 లేదా 1070 ఏర్పాటు చేశాం.
• మానవతా దృక్పదంతో వ్యవహరిస్తాం. మూడు నాలుగు రోజులు నిద్రలేకపోయినా పర్వాలేదు…ఇక్కడే ఉండి సాధారణ పరిస్థితి వచ్చే దాకా చక్కదిద్దుతాం.
• ప్రజలకు సేవకులుగా ఉంటాం.
• పంటలు, ఆస్తులు కూడా నప్టపోయిన వారిని కూడా ఆదుకుంటాం.

విజయవాడలో సాధారణస్థితి వచ్చే వరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో విజయవాడ కలెక్టరేట్‌ సీఎం.. తాత్కాలిక కార్యాలయంగా మారింది. సీఎం బస్సు కూడా కలెక్టరేట్‌ వద్దకు చేరుకుంది. అవసరమైతే ఇవాళ బస్సులోనే సీఎం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు క్షేత్రస్థాయిలో మకాం వేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది. వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ వెంటనే కలెక్టరేట్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *