విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం.. తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితుల సంక్షేమానికి సంబంధించి ప్రతి చిన్నవిషయాన్ని అర్థం చేసుకుంటూ, అవసరాలను తెలుసుకుంటూ యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముంపు ప్రభావం వల్ల ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …