Breaking News

ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : మోటూరి శంకరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో తుల తూగాలని సుహృద్భావ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను ఉపయోగించాలని, పర్యావరణానికి హాని చేసే కృత్రిమ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడరాదని, ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకులని ఉపయోగించాలని మోటూరి శంకరరావు ఆ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు , జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు, జిల్లా వ్యాప్తంగా దాతలు ముందుకు వచ్చి అందచేసిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *